Telangana: డీఎస్సీని వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థుల నిర‌స‌న‌.. హైదరాబాదులో విద్యాశాఖ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త!

Candidates Protest to Postpone DSC in Telangana
డీఎస్‌సీని వాయిదా వేయాల‌ని కోరుతూ అభ్య‌ర్థులు నిర‌స‌న‌కు దిగ‌డంతో హైద‌రాబాద్‌లోని విద్యాశాఖ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. 3 నెల‌లు వాయిదా వేయాలంటూ అభ్య‌ర్థులు కార్యాల‌యాన్ని ముట్ట‌డించేందుకు యత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.  వ‌రుస‌గా పోటీ ప‌రీక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో చ‌దువుకోవ‌డానికి స‌మ‌యం స‌రిపోద‌ని అభ్య‌ర్థులు చెబుతున్నారు. 

ఇటీవ‌లే టెట్ ఫ‌లితాలు విడుద‌లయిన నేపథ్యంలో డీఎస్సీని వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థులు కోరారు. ఇక ఉపాధ్యాయుల నియామ‌కాలు పూర్తి అయ్యేవ‌ర‌కు విద్యా వాలంటీర్ల‌ను నియ‌మించాల‌ని వారు కోరుతున్నారు.
Telangana
DSC
Protest

More Telugu News