Road Accident: గుజరాత్‌లో కలకలం.. 65 మంది ప్రయాణికులతో లోయలో పడ్డ బస్సు

 Bus with 65 passengers falls into gorge in Dang district of Gujarat two killed several injured
గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. 65 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. సూరత్‌లోని సపుతారా పర్వత ప్రాంతం నుంచి తిరిగొస్తుండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురు ప్రయాణికులకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు. మిగిలిన వారిని ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించినట్టు తెలియజేశారు. 
Road Accident
Gujarat
Bus Falls Into Gorge

More Telugu News