Salman Khan: ధోనీ బర్త్ డే వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా సల్మాన్ ఖాన్

Salman Khan attends MS Dhonis birthday
  • సన్నిహితుల మధ్య 43వ పుట్టినరోజు జరుపుకున్న టీమిండియా మాజీ సారథి
  • తొలుత భార్యకు, ఆ తర్వాత సల్మాన్ కు కేక్ తినిపించిన ధోనీ
  • హ్యాపీ బర్త్ డే కప్టాన్ సాబ్ అంటూ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసిన బాలీవుడ్ కండలవీరుడు
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ శనివారం తన 43వ పుట్టినరోజు జరుపుకున్నాడు. సన్నిహితుల మధ్య కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నాడు. ఈ వేడుకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వయంగా హాజరై మహీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఎప్పట్లానే సల్మాన్ తన ఫేవరేట్ బ్లూ జీన్స్, బ్లాక్ షర్ట్ లో తళుక్కుమనగా ధోనీ కలర్ ఫుల్ టీషర్ట్ లో మెరిసిపోయాడు. స్నేహితుల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి తొలుత తన భార్య సాక్షికి తినిపించి ఆ తర్వాత పక్కనే నిలబడిన సల్లూ భాయ్ కు కేక్ తినిపించాడు. ఈ సందర్భంగా సాక్షి సింగ్ సరదాగా భర్తకు పాదాభివందనం చేసింది.

ఈ వేడుకలో పాల్గొన్న ఫొటోను సల్మాన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. హ్యాపీ బర్త్ డే కప్టాన్ సాబ్ అంటూ ఫొటో కింద క్యాప్షన్ జత చేశాడు. అలాగే సాక్షి సింగ్ ఓ వీడియో క్లిప్ ను తన ఇన్ స్టా పేజీలో నెటిజన్లతో పంచుకుంది. సోషల్ మీడియాలో షేర్ చేయగానే ఆ ఫొటో, వీడియో వైరల్ గా మారాయి. లక్షలాది మంది తమ ఫేవరేట్ స్టార్స్ ను ఇలా ఒక్క చోట చూసి తెగ మురిసిపోయారు.
Salman Khan
MS Dhoni
Birthday Celebration
43rd
Photo
Video
Social Media
Netizens
Amused

More Telugu News