హథ్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలే బాబాపై కేసు
- తొక్కిసలాట ఘటనపై దర్యాఫ్తు చేస్తున్న యూపీ పోలీసులు
- బాబా వేదికపై ఉండగానే తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో వెల్లడి
- భక్తులను భద్రతా సిబ్బంది తోసేశారని వెల్లడి
ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. భోలే బాబా వేదికపై ఉన్న సమయంలోనే తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని విచారణలో తేలింది. భక్తులను భద్రతా సిబ్బంది తోసేశారని ఈ దర్యాఫ్తులో వెల్లడైంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.
సేవాధర్ ఆర్మీగా పిలిచే బృందం ఈ సత్సంగ్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. దీంతో ఈ ప్రమాదానికి సంబంధించి సేవాధర్ ఆర్మీలోని కీలక వ్యక్తి మధుకర్‌ను పోలీసులు నిందితుడిగా పేర్కొన్నారు. అతనిని పోలీసులు నిన్న రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు.