Chandrababu: జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrbabu reviews with ministers and officials in his Jubilee Hills residence
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కీలక సమావేశం ముంగిట ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదులోని తన నివాసంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయినా పరిష్కారం కాని వివిధ అంశాలపై నేడు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఈ కీలక సమావేశం కోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రజాభవన్ కు చేరుకోగా, చంద్రబాబు కూడా కాసేపట్లో హాజరుకానున్నారు.
Chandrababu
Review
Revanth Reddy
Hyderabad
Andhra Pradesh
Telangana

More Telugu News