Baba Vanga: 5079లో ప్రపంచం అంతం.. 3797లో భూమి నాశనం.. 'బాబా వంగా' జోస్యాలు!

Baba Vanga Pridicted that Contact with extraterrestrial civilisations in 2130
  • 2130లో గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం ఏర్పడుతుందని బాబా వంగా కాలజ్ఞానం
  • 3005లో అంగారక గ్రహంపై యుద్ధం జరుగుతుందని జోస్యం
  • రాబోయే దశాబ్దాలు, శతాబ్దాల్లో జరగబోయే ఘటనలు చెప్పిన అంధ ఆధ్యాత్మికవేత్త
కాలజ్ఞానిగా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా రానున్న దశాబ్దాలు, శతాబ్దాల కాలంలో ఏం జరగబోతున్నాయో చెప్పిన మరికొన్ని జోస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

రాబోయే దశాబ్దాల్లో బాబా వంగా జోస్యాలు..
  • 2025 - యూరప్‌లో ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. దీని కారణంగా ఈ ఖండంలో జనాభా గణనీయంగా తగ్గుతుంది.
  • 2028 - కొత్త ఇంధన వనరుల అన్వేషణలో మనుషులు శుక్ర గ్రహానికి వెళ్తారు.
  • 2033 - భూమి ధ్రువాల్లో మంచు కరగడంతో సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయి.
  • 2076 - ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుంది.
  • 2130 - గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం ఏర్పడుతుంది.
  • 2170 - ప్రపంచవ్యాప్తంగా కరవు వస్తుంది.
  • 3005 - అంగారక గ్రహంపై యుద్ధం జరుగుతుంది
  • 3797 - భూమి నాశనం అవుతుంది. అయితే సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి వెళ్లగలిగే సామర్థ్యం మానుషులకు ఉంటుంది.
  • 5079 - ఈ ప్రపంచం అంతమైపోతుంది.

కాగా బాబా వంగా అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా. 12 సంవత్సరాల వయసులోనే కంటిచూపును కోల్పోయారు. 85 ఏళ్ల వయస్సులో 1996లో ఆమె మరణించారు. అయితే బాబా వంగా జోస్యాలకు సంబంధించిన రాతపూర్వక గ్రంథాలేవీ లేవు. కానీ బాబా వంగా చెప్పారంటూ ఆమె అనుచరులు తరచుగా జోస్యాలను ప్రకటిస్తుంటారు. అందులో భాగంగానే ఈ తాజా జోస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె చెప్పిన జోస్యాల్లో చాలా నిజమయ్యాయి. ముఖ్యంగా అమెరికాను గజగజలాడించిన 9/11 ఉగ్రవాద దాడులు అక్షరాలా నిజమయ్యాయని చెబుతుంటారు. ‘‘రెండు లోహపు పక్షులు అమెరికన్ సోదరులపైకి దూసుకెళ్తాయి. పొదల చాటు నుంచి తోడేళ్లు అరుస్తాయి. అమాయకుల రక్తం నదులలో పారుతుంది’’ అని ఆమె ఊహించి చెప్పారు. అమెరికాలో జరిగిన ట్విన్ టవర్ల దాడి దీనికి దగ్గరగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బ్రిటన్ యువరాణి డయానా మరణం, బ్రెగ్జిట్‌తో పాటు మరికొన్ని ఘటనలు ఆమె జోస్యాల ప్రకారమే జరిగాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.
Baba Vanga
Baba Vanga Pridiction
Bulgaria

More Telugu News