Chandrababu: 7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం

AP CM Chandrababu will be honored in NTR Bhavan in Hyderabad on July 7th
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వచ్చే ఆదివారం (జులై 7) హైదరాబాద్‌లో ఘన సన్మానం చేయాలని తెలంగాణ టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొంటారని, ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘన సన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్‌కు తరలి రావాలని పిలుపునిచ్చారు.
Chandrababu
Telugudesam
TDP
TTDP
Telangana

More Telugu News