కరకట్టపై ప్రభుత్వ ఫైళ్ల దహనం ఘటనపై... ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- కృష్ణానది కరకట్టపై గతరాత్రి బస్తాల కొద్దీ ఫైళ్ల దహనం
- ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు సమాచారం అందించిన టీడీపీ కార్యకర్త
- బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్న పవన్ కల్యాణ్
ఇది గమనించిన ఓ టీడీపీ కార్యకర్త ఈ విషయాన్ని వెంటనే పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఇతర టీడీపీ నేతలకు తెలియజేశాడు. ఆ ఫైళ్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉండడంతో ఈ విషయాన్ని టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు.
తాజాగా ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దహనం చేసిన ఫైళ్ల వివరాలను వెంటనే తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఫైళ్లను దహనం వెనుక ఉన్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.