Kerala: కన్న కూతురిపై అఘాయిత్యం.. తండ్రికి 101 ఏళ్ల జైలు శిక్ష‌!

Muhammed sentenced to 101 years of jail for sexually assaulting his minor daughter
  • కేర‌ళ‌లో దారుణ ఘ‌ట‌న‌
  • 10 ఏళ్ల వయసు నుంచే కూతురిపై తండ్రి లైంగిక దాడి
  • బాధితురాలు 16 ఏళ్ల‌ వయసులో గర్భం దాల్చ‌డంతో వెలుగులోకి ఘ‌ట‌న‌
  • నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 101 ఏళ్ల‌ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
కేర‌ళ‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మైనర్‌ అయిన కూతురిపై తండ్రి ఆరేళ్ల‌పాటు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. తాజాగా ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ వ్యక్తికి కేరళ కోర్టు 101 ఏళ్ల‌ జైలు శిక్ష విధించింది. బాధితురాలు 16 ఏళ్ల‌ వయసులో గర్భం దాల్చ‌డంతో ఈ ఘ‌ట‌న‌ బయట ప‌డింది. 

వివ‌రాల్లోకి వెళితే.. ముహమ్మద్ అనే వ్యక్తి ఇలా తన మైనర్ కుమార్తెను ఆరేళ్లపాటు లైంగికంగా వేధించాడు. బాలికను బెదిరించి ముహమ్మద్ ఆరేళ్లపాటు అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. 10 ఏళ్ల వయసు నుంచే ఆరేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడగా 16 ఏళ్ల వయసులో బాలిక గర్భం దాల్చింది. ఆ తర్వాత తండ్రి దురాగ‌తాన్ని ఆమె బ‌య‌ట‌పెట్టింది. 

పైగా తండ్రులందరూ తమ కూతుళ్లతో ఇలాగే ప్రవర్తిస్తారని తన కూతురితో చెప్పేవాడ‌ట ముహమ్మద్‌. దీంతో ముహమ్మద్‌పై కఠిన చర్యల‌కు ఉపక్ర‌మించిన‌ కేరళ కోర్టు అత‌నికి జీవిత ఖైదుతో పాటు 101 ఏళ్ల‌ జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్ల‌డించింది. దయ చూపడానికి దోషి అనర్హుడని ఈ సందర్భంగా న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది.
Kerala
Minor Girl
Sexually Assault
Jail

More Telugu News