Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం నాటి దాడి కేసులో నిందితుల అరెస్టు

attack on TDP office in mangalagiri perpetrators arrested
మంగళగిరిలో మూడేళ్ల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటాకా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, పోలీసులు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇతరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Mangalagiri
TDP Central Office
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News