Chandrababu: లడఖ్ లో ముగ్గురు ఏపీ జవాన్లు మరణించారన్న వార్త నన్ను కలచివేసింది: చంద్రబాబు

CM Chandrababu reacts on three AP jawans died on Ladakh mishap
  • లడఖ్ లో సైనిక శిక్షణలో ప్రమాదం
  • ఆకస్మిక వరదలకు నదిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు
  • ఐదుగురు భారత జవాన్ల మృతి
  • మృతుల్లో ముగ్గురు ఏపీ జవాన్లు
లడఖ్ లో ఆకస్మిక వరదల్లో ఐదుగురు జవాన్లు మరణించగా, అందులో ముగ్గురు ఏపీ జవాన్లు ఉన్నారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు. 

"లడఖ్ లో టీ-72 యుద్ధ ట్యాంకు నదిలో కొట్టుకుపోయిన ఘటనలో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు చనిపోయారన్న ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముత్తుమల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ ల మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Jawans
Ladakh
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News