Banda Prakash: బీఆర్ఎస్‌కు భారీ షాక్... రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ బండ ప్రకాశ్

Banda Prakash meets CM Revanth Reddy
  • ప్రకాశ్ ముదిరాజ్ వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు
  • బీఆర్ఎస్ నుంచి వరుసగా కాంగ్రెస్‌లో చేరుతున్న నేతలు
  • తాజాగా బండ ప్రకాశ్ కలవడంతో ప్రాధాన్యత
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రకాశ్ ముదిరాజ్ వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బండ ప్రకాశ్ ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రితో యంగోన్ కార్పోరేషన్ సీఈవో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యంగోన్ కార్పోరేషన్ సీఈవో, చైర్మన్ కిహాక్ సంగ్ బృందం భేటీ అయింది. సోమవారం సాయంత్రం సచివాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, యంగోన్ కార్పోరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Banda Prakash
Revanth Reddy
Congress
BRS

More Telugu News