Pawan Kalyan: డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు తెరవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan opines canteens should open in the name of Dokka Seethamma
  • కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం
  • డొక్కా సీతమ్మ నిత్యాన్నదాత అని కొనియాడిన వైనం
  • డొక్కా సీతమ్మ సేవలను నిత్యం స్మరించుకోవాలని పిలుపు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా, నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరుపొందారని పవన్ వివరించారు. ఆ మహనీయురాలి సేవలను మనమంతా ప్రతి రోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఇక, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం పేరు ప్రపంచస్థాయిలో వినిపించినప్పుడే తాను నెగ్గినట్టు భావిస్తానని ఉద్ఘాటించారు. 

సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేశానని వివరించారు. పవన్ కల్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేశారు.
Pawan Kalyan
Dokka Seethamma
Canteens
Gollaprolu
Janasena
Kakinada District

More Telugu News