Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Indian stock markets closed with profits today
  • జులై మాసాన్ని లాభాలతో ఆరంభించిన సెన్సెక్స్, నిఫ్టీ
  • క్లోజింగ్ బెల్ సమయానికి సెన్సెక్స్ ట్రేడింగ్ లో 443 పాయింట్ల వృద్ధి
  • 131 పాయింట్లు లాభపడి 24,141.95 వద్ద స్థిరపడిన నిఫ్టీ
భారత స్టాక్ మార్కెట్లు జులై నెలను లాభాలతో ఆరంభించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నేడు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 443.46 పాయింట్ల వృద్ధితో 79,476.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 131.35 పాయింట్లు లాభపడి 24,141.95 వద్ద స్థిరపడింది.

టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలు అందుకోగా... ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ షేర్లు నష్టాలు చవిచూశాయి. 

అమెరికా ఫెడరల్ బ్యాంకు సెప్టెంబరులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలున్న నేపథ్యంలో... భారత స్టాక్ మార్కెట్లు ఇదే లాభాల ఒరవడిని కొనసాగిస్తాయని భావిస్తున్నట్టు వినోద్ నాయర్ అనే స్టాక్ మార్కెట్ నిపుణుడు వెల్లడించారు.
Stock Market
Sensex
Nifty
India

More Telugu News