Telangana: కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం తెలంగాణలోని చార్మినార్‌లో తొలి కేసు

Telangana Police registers first case under new criminal laws
  • నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించిన ద్విచక్ర వాహనదారుడు
  • కొత్త చట్టాల ప్రకారం 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు
  • చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం తెలంగాణలో తొలి కేసు నమోదయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నేర, న్యాయ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఈ కొత్త చట్టం కింద మధ్యప్రదేశ్‌లో అర్ధరాత్రి 12.20 గంటలకు తొలి కేసు నమోదు కాగా... తెలంగాణ రాష్ట్రంలో చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో మొదటి కేసు నమోదయింది. నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్‌ను డిజిటల్‌గా నమోదు చేశారు.

దేశంలో బ్రిటిష్ పాలన నుంచి కొనసాగుతున్న ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ)కు గత 17వ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ చట్టాలు జులై 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్ ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ వంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలోకి ప్రవేశించాయి.
Telangana
Crime News
New Criminal News

More Telugu News