Vasundhara: హిందూపురంలో నందమూరి వసుంధర దేవి పింఛ‌న్ల పంపిణీ

Balakrishna Wife Vasundhara Distributes NTR Bharosa Pension to Beneficiaries at Hindupuram
  • ఏపీలో కొన‌సాగుతున్న‌ ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్ష‌న్ల పంపిణీ
  • స్వ‌యంగా ఇంటింటికి వెళ్లి పింఛ‌న్లు పంపిణీ చేస్తున్న ప్ర‌జా ప్ర‌తినిధులు 
  • చిల‌మ‌త్తురు, లేపాక్షిల‌లో పింఛ‌నుదారుల‌కు పెన్ష‌న్ అంద‌జేసిన వ‌సుంధ‌ర‌
  • ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను వంద‌కు వంద శాతం అమ‌లు చేసి చూపిస్తామని వ్యాఖ్య‌
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్ష‌న్ల పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది. చాలా చోట్ల ప్ర‌జా ప్ర‌తినిధులు స్వ‌యంగా ఇంటింటికి వెళ్లి పింఛ‌న్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీస‌త్య‌సాయి జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో నందమూరి బాల‌కృష్ణ అర్ధాంగి వసుంధర దేవి స్వ‌యంగా పింఛ‌నుదారుల‌కు పెన్ష‌న్ అంద‌జేశారు. చిల‌మ‌త్తురు, లేపాక్షిల‌లో ఇంటింటికి వెళ్లి ల‌బ్ధిదారుల‌కీ రూ. 7 వేలు పింఛన్ సొమ్మును అందజేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆమె ముందుగా ఎన్‌టీఆర్‌, చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోల‌కు క్షీరాభిషేకం చేశారు. బాల‌య్య‌కు హ్యాట్రిక్ విజ‌యాన్ని అందించిన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు వ‌సుంధ‌ర దేవి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ విజయంతో త‌మ‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను వంద‌కు వంద శాతం అమ‌లు చేసి చూపిస్తామ‌న్నారు.
  
Vasundhara
NTR Bharosa Pension
Andhra Pradesh
Hindupuram
Balakrishna

More Telugu News