Chandrababu: బంగారుతల్లి సీమా పర్వీన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను: సీఎం చంద్రబాబు

CM Chandrababu tweets about Seema Parveen
  • ఏపీలో నేడు పెన్షన్ల పంపిణీ
  • సీమా పర్వీన్ అనే అమ్మాయికి పెన్షన్ తొలగించారని గతంలో చంద్రబాబు ఆగ్రహం
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీమా పర్వీన్ పెన్షన్ పునరుద్ధరణ
ఏపీలో ఇవాళ పెన్షన్ల కోలాహలం నెలకొంది. సీఎం చంద్రబాబు సైతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురికి స్వయంగా పెన్షన్లు అందజేశారు. 

ఇక, కూటమి ప్రభుత్వం నుంచి నేడు పెన్షన్ అందుకున్నవారిలో సీమా పర్వీన్ ఒకరు. ఆ అమ్మాయికి పెన్షన్ కు అందించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. బంగారు తల్లి సీమా పర్వీన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని వెల్లడించారు. అంతేకాదు, పెన్షన్ అందించిన ఫొటోను కూడా పంచుకున్నారు. 

చంద్రబాబు ఆమె గురించి ట్వీట్ చేయడానికి బలమైన కారణమే ఉంది. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సీమా పర్వీన్ పెన్షన్ తొలగించిందని అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మండిపడ్డారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రుల చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడం ఏంటి? అంటూ గతేడాది ఏప్రిల్ లో ట్వీట్ చేశారు. 

ఇప్పుడామెకు తమ ప్రభుత్వం పెన్షన్ పునరుద్ధరించిందన్న విషయాన్ని సీఎం చంద్రబాబు సంతోషంగా వెల్లడించారు.
Chandrababu
Seema Parveen
Pension
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News