Shatrughan Sinha: తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

Shatrughan sinha suffering from fever admitted in hospital
  • సోషల్ మీడియాలో వెల్లడించిన కుమారుడు లవ్ సిన్హా
  • గత కొన్ని రోజులుగా కూతురి పెళ్లితో బిజీబిజీగా గడిపిన నటుడు
  • ఆసుపత్రిలో ఉన్న తండ్రిని చూసి వెళ్లిన కుమార్తె సోనాక్షి సిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శ్రతుఘ్న సిన్హా తీవ్ర జ్వరంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. ‘‘నాన్నకు తీవ్ర జ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం. అలాగే సాధారణంగా చేయించే అన్ని వైద్య పరీక్షలు చేయిస్తున్నాం’’ అని లవ్ సిన్హా చెప్పారు. అయితే, ఆయనను ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చారనేదానిపై మాత్రం స్పష్టత లేదు. 

గతనెలలో వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమబెంగాల్‌లోని ఆసన్‌సోల్ నియోజకవర్గం నుంచి సిన్హా విజయం సాధించిన విషయం తెలిసిందే. 1969లో శత్రఘ్న సిన్హా సినీరంగ ప్రవేశం చేశారు. ‘మేరే అప్నే’, ‘కాళీ చరణ్’, ‘విశ్వనాథ్’, ‘కాలా పత్థర్’, ‘దోస్తానా’ వంటి చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు. వారం రోజుల కిందటే ఆయన కుమార్తె, బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా వివాహం తన సహనటుడు జహీర్ ఇక్బాల్‌తో జరిగింది. ఈ కార్యక్రమాలతో జూన్ నెలంతా శత్రుఘ్న సిన్హా బిజీబిజీగా గడిపారు. అయితే, శత్రుఘ్న సిన్హాకు చిన్నపాటి శస్త్రచికిత్స జరిగిందన్న కథనాలను కుమారుడు లవ్ ఖండించారు. ఇక నూతన వధూవరులు సోనాక్షి, జహీర్ ఆసుపత్రిలో ఉన్న శత్రుఘ్న సిన్హాను సందర్శించి వెళ్లారు.
Shatrughan Sinha
Bollywood
Sonakshi Sinha

More Telugu News