Revanth Reddy: డీఎస్ లేని లోటు ఎవరూ తీర్చలేరు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy pays tributes to DS mortal remains in Nizamabad
  • నిన్న హైదరాబాదులో కన్నుమూసిన డీఎస్
  • నేడు నిజామాబాద్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  • డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల డీఎస్ నిన్న వేకువ జామున హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఇవాళ అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిజామాబాద్ లో నిర్వహించనున్నారు. 

ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ తనయులు సంజయ్, ఎంపీ అర్వింద్ లతో మాట్లాడారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

డీఎస్ లేని లోటును ఎవరూ తీర్చలేరని అన్నారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రకాలుగా సేవలు అందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో డీఎస్ పాత్ర కీలకం అని పేర్కొన్నారు. డీఎస్ కుటుంబానికి తమ సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy
DS
Nizamabad District
Congress
Telangana

More Telugu News