Narendra Modi: 2016లో చంద్రబాబుతో కలిసి కాఫీ తాగుతున్న దృశ్యాలను పంచుకున్న ప్రధాని మోదీ

PM Modi says he is an admirer of Araku Coffee as well
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికార పీఠం ఎక్కాక నేడు తొలిసారి 'మన్ కీ బాత్' తో ప్రజల ముందుకు వచ్చారు. తన ప్రసంగంలో ఆయన అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. తాను కూడా అరకు కాఫీకి అభిమానినే అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఫొటోలను కూడా పంచుకున్నారు. "2016లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నాం. అప్పటి ఫొటోలు ఇవి. గొప్ప విషయం ఏమిటంటే, అరకు కాఫీ గిరిజన సాధికారత అంశంతో ముడిపడి ఉంది" అని మోదీ వివరించారు.
Narendra Modi
Araku Coffee
Chandrababu
Visakhapatnam
Mann Ki Baat
BJP
NDA
TDP
Andhra Pradesh

More Telugu News