Team India: జగజ్జేత భారత్.. రన్నరప్ సౌతాఫ్రికా ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

T20 World Cup Prize Money How Much India And South Africa Earns
  • నిరీక్షించిన భారత్ సుదీర్ఘ నిరీక్షణ
  • భారత్‌కు రూ. 20.42 కోట్ల ప్రైజ్‌మనీ
  • రూ. 10.67 కోట్లు అందుకున్న సఫారీలు
  • ఇంగ్లండ్, ఆఫ్ఘన్ జట్లకు చెరో రూ. 6.56 కోట్ల ప్రైజ్‌మనీ
ప్రపంచకప్ కోసం భారత్ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించిన రోహిత్‌శర్మ నేతృత్వంలోని భారత జట్టు కోట్లాదిమంది భారతీయుల ఆశలను నిజం చేస్తూ ప్రపంచకప్‌ను సగర్వంగా ముద్దాడింది. 

జగజ్జేతగా నిలిచిన భారత్‌కు, రన్నరప్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్‌మనీ ఎంత లభిస్తుందన్న చర్చ క్రికెట్ ప్రేమికుల్లో మొదలైంది. టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు 2.45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 20.42 కోట్లు) అందుకోగా, రన్నరప్‌గా నిలిచిన సఫారీలకు 1.28 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.67 కోట్లు) లభించింది. సెమీఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లకు  చెరో రూ. 6.56 కోట్లు లభించింది.
Team India
Team South Africa
T20 World Cup 2024
Prize Money

More Telugu News