Narendra Modi: దేశ ప్రజల తరఫున టీమిండియాను అభినందించిన ప్రధాని మోదీ

PM Modi congratulates Team India after winning T20 World Cup
  • టీ20 వరల్డ్ కప్ లో విన్నర్ గా టీమిండియా
  • ఇది చారిత్రాత్మక విజయం అని అభివర్ణించిన ప్రధాని మోదీ
  • దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారని వెల్లడి
  • టీమిండియా ఇదే పరంపర కొనసాగించాలని ఆకాంక్ష
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచిన తీరు చారిత్రాత్మకం అని అభివర్ణించారు. టీమిండియా ఈ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. 

ఫైనల్లో మీ అద్భుత ప్రదర్శన పట్ల దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారు అని పేర్కొన్నారు. మైదానంలో మీరు వరల్డ్ కప్ గెలిచారు... దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలోనూ ప్రజల హృదయాలను  గెలిచారు అని ప్రధాని మోదీ వివరించారు. 

ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉందని, టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలిచిందని, ఇది అమోఘమైన ప్రదర్శన అని కొనియాడారు. టీమిండియా ఇదే పరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు.
Narendra Modi
T20 World Cup 2024
Team India
Winner

More Telugu News