Arvind Kejriwal: సీబీఐ కస్టడీ అనంతరం..కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ

 Arvind Kejriwal sent to judicial custody till July 12 in excise policy case
  • జులై 12 వరకు కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ
  • బుధవారం నుంచి మూడ్రోజుల పాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ
  • ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. జులై 12 వరకు ఆయనను కస్టడీకి ఇచ్చింది. కేజ్రీవాల్ మూడు రోజుల సీబీఐ కస్టడీ నిన్నటితో ముగిసింది. అనంతరం ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించింది.
Arvind Kejriwal
AAP

More Telugu News