Viral Videos: ఫైవ్ స్టార్ హోటల్ బాల్కనీలో దుస్తులు ఆరేసిన భారతీయ మహిళ.. వీడియో ఇదిగో!

Indian woman drying clothes in five star hotel balcony video goes viral
  • కుటుంబంతో దుబాయ్ పర్యటనకు వెళ్లిన మహిళ
  • ఫైవ్ స్టార్‌ హోటల్‌ బాల్కనీలో దుస్తులు ఆరేసిన వైనం
  • తల్లి తీరుకు మురిసిపోతూ వీడియో షేర్ చేసిన కూతురు
  • వీడియోపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో హాటల్ యాజమాన్యం స్పందన
  • తల్లికి బాధ్యతలు తప్పవుగా అంటూ కామెంట్
దుబాయ్‌లో విహార యాత్రకు వెళ్లిన ఓ భారతీయ మహిళ అక్కడి ఫైవ్ స్టార్‌ హోటల్ బాల్కనీలో దుస్తులు ఆరేయడం నెట్టింట సంచలనంగా మారింది. ఆమె చర్య చూసి అనేక మంది మురిసిపోతుంటే కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. 

పల్లవి వెంకటేశ్ అనే మహిళ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ వారు అట్లాంటిస్ హోటల్‌లో దిగారు. అయితే, విహార యాత్రలో ఉన్నప్పటికీ పల్లవి తల్లి తన బాధ్యతలు మర్చపోలేదు. కుటుంబసభ్యులకు ఇబ్బంది రాకుండా తమ హోటల్ గది బాల్కనీలో దుస్తులు ఆరేసింది. ఈ వీడియోను షేర్ చేసిన పల్లవి మా అమ్మ తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోదు అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. 

వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. హోటల్‌లో అలా చేయకూడదని కొందరు అన్నారు. ఈలోపు హోటల్ యాజమాన్యం వారు కూడా ఘటనపై స్పందించారు. 'తల్లికి బాధ్యతలు తప్పవుగా..' అంటూ కామెంట్ చేశారు. అయితే, దస్తులు ఆరేసుకునేందుకు గదిలోనే వసతులు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. దీంతో, ఆమెపై వచ్చిన విమర్శలకు ఫుల్ స్టాప్ పడింది.
Viral Videos
Dubai tour
drying clothes in hotel balconly

More Telugu News