Chandrababu: పోలవరంపై అంబటి వ్యాఖ్యలు విని నవ్వుకున్న సీఎం చంద్రబాబు... వీడియో వైరల్

Chandrababu laughs after seen Ambati comments on Polavaram
  • పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • నాడు అంబటి చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించిన చంద్రబాబు
  • పోలవరం అంటే అంత హాస్యం అయిపోయిందని చంద్రబాబు విచారం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పోలవరంపై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా నేటి మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

పోలవరంపై అంబటి వ్యాఖ్యలు చూసి సీఎం చంద్రబాబు పడీ పడీ నవ్వుకున్నారు. "పోలవరం ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైన వ్యవహారం. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటీ... అంత అర్థం కాలేదు అని గట్టిగా చెబుతున్నానంటే... నాకు అర్థం కాలేదు కాబట్టి..." అంటూ అంబటి వ్యాఖ్యానించడం ఆ వీడియోలో చూడొచ్చు. 

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, పోలవరం అంటే అంత హాస్యం అయిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Chandrababu
Ambati Rambabu
Polavaram Project
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News