Swapna Dutt: నాకు ఆశ్చర్యంగా ఉంది... 'క‌ల్కి' వ‌సూళ్ల‌ గురించి చాలా మంది అలా అడుగుతుంటే!: నిర్మాత స్వప్న దత్​

Swapna Dutt Interesting Tweet on Kalki 2898 AD Collections
  • ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో 'కల్కి 2898 ఏడీ'
  • మూవీకి ప్రీమియర్ షో నుంచే హిట్‌టాక్‌
  • ఈ చిత్రం తొలిరోజు భారీ వసూళ్లు సాధించిందంటూ క‌థ‌నాలు
  • రికార్డులు తిరగరాసిందంటూ వార్త‌లు
  • ఈ నేప‌థ్యంలో నిర్మాత స్వప్న దత్ 'ఎక్స్'లో ఆస‌క్తిక‌ర‌ పోస్ట్
రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ ప్రీమియర్ షో నుంచే హిట్‌టాక్‌ తో దూసుకెళ్తోంది. మహాభారతంలోని ఘట్టాలకు సైన్స్‌ను జోడించ‌డం ద్వారా సైన్స్‌ఫిక్ష‌న్‌గా రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. అయితే, ఈ చిత్రం తొలిరోజు భారీ వసూళ్లు సాధించింద‌ని, పలు రికార్డులను తిరగరాసిందని బయట కథనాలు వినిపిస్తున్నాయి. కానీ చిత్రం యూనిట్‌ మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత స్వప్న దత్ మూవీ వ‌సూళ్ల‌ రికార్డులపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక ఆస‌క్తిక‌ర‌ పోస్ట్ పెట్టారు.

"నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా మంది రికార్డ్స్ క్రాస్ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే రికార్డులు సృష్టించిన వారెవరు కూడా ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమాపై ప్రేమతో చిత్రాలను చేస్తారు. మేము కూడా అలాగే తీశాం" అంటూ ఆమె రాసుకొచ్చారు. దీంతో ఈపోస్ట్ ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Swapna Dutt
Kalki 2898 AD
Nag Ashwin
Prabhas
Tollywood

More Telugu News