Kalki 2898AD: కల్కి 2898 ఏడీ చిత్రం రివ్యూలు అద్భుతంగా ఉన్నాయి... చాలా సంతోషంగా ఉంది: ఏపీ మంత్రి నారా లోకేశ్

AP Minister Nara Lokesh opined on Kalki 2898 AD movie garneres top rating reviews
  • ప్రభాస్ ప్రధాన పాత్రలో కల్కి 2898 ఏడీ
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిత్రం
  • నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే ప్రధాన పాత్రల్లో నటించిన భారీ చిత్రం కల్కి 2898 ఏడీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు అన్ని రివ్యూలు వారెవ్వా అనే రీతిలో వస్తున్నాయి. హాలీవుడ్ కు తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన జవాబు ఈ కల్కి 2898 ఏడీ అని సినీ విమర్శకులు అంటున్నారు.

కాగా, ఈ చిత్రంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "కల్కి 2898 ఏడీ చిత్రం రివ్యూలు అద్భుతంగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి, కమల్ హాసన్ గారికి, దీపిక పదుకొనే గారికి, దర్శకుడు నాగ్ అశ్విన్ గారికి నా అభినందనలు. కళాఖండం అనదగ్గ ఈ చిత్రంతో భారతీయ సినిమాను పునర్ నిర్వచించారు. నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న, ప్రియాంకలకు ప్రత్యేక అభినందనలు. అన్ని సినీ సూత్రాలను తిరగరాసి తెలుగు సినిమాను అంతర్జాతీయ బరిలో నిలిపారు" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Kalki 2898AD
Nara Lokesh
Reviews
Prabhas
Nag Aswin

More Telugu News