Mangalagiri CI: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆఫీసులో సీఐ హల్ చల్

Mangalagiri CI Transffered after AP Deputy CM Camp Office Staff complaint
  • అపాయింట్ మెంట్ లేకున్నా నేరుగా లోపలికి
  • అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై ఆగ్రహం
  • పవన్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతో లోపలికి వెళ్లిన సీఐ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించారు. ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోకుండా, భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా ఆగకుండా నేరుగా లోపలికి వెళ్లారు. ఓవైపు పవన్ కల్యాణ్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతోనే ఆయన లోపలికి వెళ్లారు. 

భధ్రతా సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. సదరు సీఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను మంగళగిరి టౌన్ సీఐగా నియమిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 

కాగా, సీఐ శ్రీనివాసరావు గతంలోనూ ఇలాగే దురుసుగా వ్యవహరించారని, జనసేన ఆఫీసులో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్ లో తనిఖీల పేరుతో హడావుడి చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Mangalagiri CI
AP Deputy CM
Pawan Kalyan
Dy CM Camp office

More Telugu News