Vodafone Idea: 30 జీబీ అదనపు డేటాతో వొడాఫోన్ ఐడియా నుంచి మరో కొత్త ప్లాన్

Vodafone Idea offers 30GB of data additional data with this plan
  • రూ. 1449 ప్లాన్‌తో అదనంగా 30 జీబీ డేటా
  • ఆరు నెలల కాలపరిమితిలో మొత్తం 300 జీబీ డేటా
  • వీఐ యాప్ ద్వారా అదనపు డేటాను క్లెయిమ్ చేసుకునే అవకాశం
30 జీబీ అదనపు డేటాతో వొడాఫోన్ ఐడియా మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటించింది. దీర్ఘకాలిక ప్లాన్ అయిన రూ.1449తో దీనిని ఆఫర్ చేస్తోంది. కాలింగ్, ఎస్సెమ్మెస్‌తోపాటు డేటా ప్రయోజనాలను కోరుకునే వారిని ఉద్దేశించి ఈ ఆఫర్ ప్రకటించింది.

రూ.1449 ప్లాన్‌లో ఏమేమి లభిస్తాయి?
వొడాఫోన్ ఐడియా రూ. 1449 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 1.5 జీబీ డేటా 180 రోజులు (ఆరు నెలల) కాలపరిమితితో లభిస్తాయి. ఇప్పుడీ ప్యాక్‌లో బోనస్‌గా 30 జీబీ అదనపు డేటా లభిస్తుంది. దీంతో ఈ ప్యాక్‌లో మొత్తం డేటా 300 జీబీ లభిస్తుంది. వీఐ యాప్ ద్వారా అదనపు డేటాను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్యాక్‌లో బింగే ఆల్‌నైట్, వీకెండ్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్స్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బింగే ఆల్‌నైట్ ఆఫర్‌లో రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు డేటాను అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు.
Vodafone Idea
30GB Additional Data
Prepaid Plan
Telecom

More Telugu News