Hemant Mistry: భారతీయ అమెరికన్‌ ముఖంపై దుండగుడి పిడిగుద్దులు.. మృత్యువాత

Hemant Mistry Indian American man died after being punched by a man in Oklahoma
  • అమెరికాలోని ఓక్లహామాలో దారుణం
  • హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్న హేమంత్ మిస్త్రీ మృతి 
  • అనుమానితుడిని అరెస్టు చేసిన పోలీసులు
అమెరికాలో మరో దారుణం వెలుగుచూసింది. ఓక్లహామాలో ఓ హోటల్ లో మేనేజర్‌గా పనిచేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి ముఖంపై ఓ దుండగుడు పిడిగుద్దులు గుద్దాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయారు. జూన్ 22న రాత్రి 10 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.  

41 ఏళ్ల రిచర్డ్ లూయిస్ అనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. హోటల్ ప్రాంగణంలో ఉండొద్దంటూ హేమంత్ మిస్త్రీ కోరడంతో నిందితుడు ఆగ్రహంతో పిడిగుద్దులు కురిపించాడని పోలీసులు వివరించారు. దెబ్బలు తాళలేక పోయిన మిస్త్రీ స్పృహతప్పి పడిపోయాడని, ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని వెల్లడించారు. చికిత్స పొందుతూ జూన్ 23న చనిపోయాడని చెప్పారు.

కాగా ఒక హోటల్‌లో దాక్కున్న నిందితుడు లూయిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం ఓక్లహామా కౌంటీ జైలులో ఉంచారు. కాగా నిందితుడిని హోటల్ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని ఎందుకు అడిగారో తెలియరాలేదని, దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా హేమంత్ మిస్త్రీ గుజరాత్‌కు చెందినవారు.
Hemant Mistry
Indian American
Oklahoma
USA

More Telugu News