Telugudesam: ప్రత్యర్థుల దాడి.. ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి భార్య మృతి

Allagadda TDP leader AV Bhaskar Reddys wife dies in attack by Rivals
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడు ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన భార్య శ్రీదేవిపై ప్రత్యర్థులు దాడి చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో శ్రీదేవీ ప్రాణాలు కోల్పోయారు. 

టీడీపీ స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించి బంధువులతో మాట్లాడారు.. ఈ ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు భాస్కర్ రెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది.
Telugudesam
Allagadda
AV Bhaskar Redd
Andhra Pradesh

More Telugu News