Hanuma Vihari: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి అభినందనలు తెలిపిన హనుమ విహారి

Hanuma Vihari met AP Deputy CM Pawan Kalyan
  • గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రా క్రికెట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న హనుమ విహారి
  • రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కెప్టెన్సీకి రాజీనామా చేసిన విహారి
  • నేడు ఏపీ మంత్రి నారా లోకేశ్ తో భేటీ
  • అనంతరం పవన్ కల్యాణ్ ను కలిసిన విహారి
ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి మళ్లీ ఆంధ్రా క్రికెట్ లోకి పునరాగమగనం చేయడం దాదాపు ఖాయమైంది. ఇవాళ ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన హనుమ విహారి... లోకేశ్ భరోసా ఇచ్చారని, తాను మళ్లీ ఆంధ్రా క్రికెట్ లోకి తిరిగి వస్తానని పేర్కొన్నారు. 

లోకేశ్ తో భేటీ అనంతరం హనుమ విహారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. పిఠాపురంలో పవన్ విజయం పట్ల, డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టడం పట్ల అభినందించారు. 

ఈ సందర్భంగా... హనుమ విహారి కెరీర్ గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, సవాళ్లను విహారి... పవన్ కు వివరించారు. విహారికి తాము అండగా ఉంటామని పవన్ కల్యాణ్ కూడా భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.
Hanuma Vihari
Pawan Kalyan
Nara Lokesh
TDP-JanaSena-BJP Alliance
Andhra Cricket
ACA
Andhra Pradesh

More Telugu News