Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. గంజాయి మత్తులో దించి బాలికపై ఐదుగురు యువకుల అఘాయిత్యం

5 Men trapped girl and assaulted in Hyderabad
  • నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఘటన
  • బాలికకు వలవేసి గంజాయి అలవాటు చేసిన నిందితులు
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
బాలికకు గంజాయి అలవాటు చేసిన ఐదుగురు యువకులు ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. కాచిగూడకు చెందిన బాలికకు ఐదుగురు యువకులు వల వేసి, మచ్చిక చేసుకుని, ఆపై ఆమెకు గంజాయి అలవాటు చేశారు. ఆ తర్వాత ఆమెను నేరేడ్‌మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న బాలిక తేరుకున్న తర్వాత ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad
Neredmet
Crime News

More Telugu News