Supriya Yarlagadda: ఇవాళ పవన్-నిర్మాతల భేటీలో ఆసక్తికర దృశ్యం

Producer Supriya Yarlagadda met Pawan Kalyan in Vijayawada
  • విజయవాడలో పవన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
  • పవన్ ను కలిసిన వారిలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ
  • పవన్ మొదటి చిత్రంలో సుప్రియే హీరోయిన్
  • నేడు పవన్ తో ప్రత్యేకంగా ఫొటో దిగిన సుప్రియ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఇవాళ తెలుగు సినీ నిర్మాతలు కలిసిన సంగతి తెలిసిందే. సీనియర్ నిర్మాతలతో పాటు యువ నిర్మాతలు కూడా నేడు పవన్ ను కలిసి విషెస్ తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పవన్ కల్యాణ్ ను కలిసిన వారిలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ కూడా ఉన్నారు. పవన్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో సుప్రియనే హీరోయిన్. సుప్రియ టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనకోడలు. ఆమెకు కూడా అదే మొదటి సినిమా. సుప్రియ ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇవాళ పవన్ తో సమావేశంలో ఆమె కూడా పాల్గొన్నారు. పవన్ తో ప్రత్యేకంగా ఫొటో దిగి మురిసిపోయారు. వీరిద్దరి ఫొటో వైరల్ అవుతోంది.
Supriya Yarlagadda
Pawan Kalyan
Akkada Ammayi Ikkada Abbayi
Vijayawada

More Telugu News