Kerala: 'కేరళ'ను 'కేరళం'గా మార్చాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం

Kerala Assembly passes new resolution to change state name to Keralam
  • గతంలోనే కేంద్రానికి తీర్మానం పంపించిన కేరళ ప్రభుత్వం
  • సవరణలు కోరుతూ తిప్పిపంపిన కేంద్రం
  • సవరణలు చేసి తీర్మానం ప్రవేశపెట్టిన కేరళ ప్రభుత్వం
కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చడానికి రాజ్యాంగ సవరణను తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన దాదాపు ఏడాది తర్వాత, సోమవారం చిన్న చిన్న సవరణలతో అసెంబ్లీ కొత్త తీర్మానాన్ని ఆమోదించింది. సవరణలు కోరుతూ కేంద్రం నాటి తీర్మానాన్ని వెనక్కి పంపించింది. దీంతో సభ సవరణలు చేస్తూ తీర్మానం చేసింది.

రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రాన్ని అధికారికంగా 'కేరళం'గా మార్చడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపింది. పేరు మార్పున‌కు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వ‌ర‌లో కేంద్రానికి పంప‌నున్నారు.
Kerala
Assembly
Keralam

More Telugu News