Revanth Reddy: రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy will go to Delhi tomorrow
  • జూన్ 24 నుంచి లోక్ సభ సమావేశాలు
  • రేపు లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం
  • హాజరుకానున్న రేవంత్ రెడ్డి 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (జూన్ 24) ఢిల్లీ వెళ్లనున్నారు. రేపటి నుంచి లోక్ సభ సమావేశాలు జరగనుండగా, ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. 

ఢిల్లీ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అనంతరం ఏఐసీసీ సమావేశాలకు హాజరుకానున్నారు. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ తో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది.
Revanth Reddy
New Delhi
Congress
Lok Sabha
Telangana

More Telugu News