Pawan Kalyan: రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు

Tollywood producers will meet AP Deputy CM Pawan Kalyan tomorrow
  • ఏపీలో కొత్త ప్రభుత్వం
  • డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ 
  • సినీ పరిశ్రమలో నవ్యోత్సాహం
  • విజయవాడ క్యాంపు కార్యాలయంలో రేపు మధ్యాహ్నం కీలక సమావేశం
టాలీవుడ్ సినీ నిర్మాతలు రేపు (జూన్ 24) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవనున్నారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలో ఈ భేటీ జరగనుంది. 

నిర్మాతలు అశ్వనీదత్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవనున్నారు. 

చిత్ర పరిశ్రమ సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కల్యాణ్ కు వివరించనున్నారు. సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Pawan Kalyan
Producers
Tollywood
Vijayawada
Janasena
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News