Mallu Bhatti Vikramarka: రేపు శ్రీశైలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన

Telangana Dy CM Bhatti Vikramarka will visit Srisailam tomorrow
  • జూన్ 24న శ్రీశైలంలో పర్యటించనున్న భట్టి విక్రమార్క 
  • ఉదయం 11 గంటలకు భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనం
  • అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన
  • లెఫ్ట్ పవర్ బ్యాంక్ అధికారులతో సమీక్ష
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రేపు (జూన్ 24) శ్రీశైలం క్షేత్రానికి రానున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఇక్కడి శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం, భట్టి విక్రమార్క శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. తెలంగాణ పరిధిలోని లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పవర్ హౌస్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
Mallu Bhatti Vikramarka
Srisailam
Dy CM
Congress
Telangana

More Telugu News