Friendship marriage: కలిసి ఉండడానికే పెళ్లి.. కాపురం మాత్రం నో.. జపాన్ లో కొత్త ట్రెండ్

Friendship marriage without love or sex A New Trend In Japan
  • జపాన్ లో పెరుగుతున్న ‘ఫ్రెండ్ షిప్ మ్యారేజ్’ ట్రెండ్
  • ప్రభుత్వ పథకాల ప్రయోజనం కోసం పెళ్లి తంతు
  • శారీరకంగా తప్ప అన్నింటా కలిసి ఉంటున్న జంటలు
సంప్రదాయబద్ధంగా వివాహానికి సై అంటున్నారు.. ఆపై కలిసి జీవించేందుకూ సరే అంటున్నారు కానీ కాపురానికి మాత్రం నో చెబుతున్నారు. ప్రేమ, సెక్స్ తప్ప మిగతా అన్నింటా మిగతా అందరిలానే ఉంటున్నారీ జంటలు. దీనిని ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ అంటున్నారు. మన దేశంలో కాదులెండి.. జపాన్ లో ఈ ట్రెండ్ బాగా పెరిగిందట. పెళ్లి బంధంతో ఒక్కటై నచ్చినా నచ్చకున్నా కలిసి కాపురం చేయడం, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సి రావడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ ఆలోచన. 

ఇటీవలి కాలంలో దేశ జనాభాలో యువత తగ్గిపోవడం, వృద్ధుల జనాభా పెరగడం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కారణమేంటని ఆరా తీయగా.. పెరుగుతున్న జీవన వ్యయం తట్టుకోలేక చాలామంది యువతీయువకులు దాంపత్య జీవనం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారని తేలింది. పెళ్లి చేసుకోవడానికి యువత చూపుతున్న విముఖతను తగ్గించడానికి ప్రభుత్వం సరికొత్త ఆలోచనను అమలు చేస్తోంది.

వివాహం చేసుకున్న జంటలకు పలు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం, వివిధ సంక్షేమ పథకాలకు పెళ్లి అయిన వారినే అర్హులుగా చేయడం.. వంటి చర్యలు చేపట్టింది. దీంతో ఈ ప్రయోజనాలు కోల్పోవడం ఇష్టంలేక వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది. ఇష్టం లేకున్నా ఇలా చేయాల్సి రావడంతో మధ్యే మార్గంగా ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ విధానం తెరపైకి వచ్చింది. 

ఏంటీ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్..
ఇదీ వివాహ బంధమే.. అయితే, ఇందులో ప్రేమ, సెక్స్ లకు తావుండదు. యువతీయువకులు స్నేహితులుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఒకరి ఆసక్తులను మరొకరు గౌరవించుకుంటూ, అన్ని పనులూ పంచుకుంటూ జీవిస్తున్నారు. కృత్రిమ గర్భదారణ పద్ధతిలో తల్లిదండ్రులుగా మారుతున్నారు. పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులుగా కలిసే చూసుకుంటారు.
Friendship marriage
Japan
without love And sex
New Trend
Offbeat

More Telugu News