Nara Lokesh: జగన్.. ఆ సొమ్ముతో 25 వేలమంది పేదలకు ఇళ్లు కట్టివ్వొచ్చు తెలుసా?: నారా లోకేశ్

Nara Lokesh Slams Jagan About YCP Offices
  • జిల్లాల్లో జగన్ నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల ఫొటోలు షేర్ చేసిన లోకేశ్
  • ఏంటీ విలాసాల పిచ్చి అని ఆగ్రహం
  • 26 జిల్లాల్లో 42 ఎకరాల్లో 33 ఏళ్లకు రూ. 1000 లీజా అని ప్రశ్న
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏలూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన లోకేశ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా? అని ప్రశ్నించారు.

వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకుపైగా భూములను రూ.1000 నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నీ ఒక్కడి భూ దాహానికి కబ్జా అయిన రూ. 600 కోట్లకుపైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ. 500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టివ్వొచ్చు. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి?’ అని ప్రశ్నించారు. నీ ధన దాహానికి అంతే లేదా? అని లోకేశ్ మండిపడ్డారు.
Nara Lokesh
Telugudesam
YSRCP
YS Jagan
Andhra Pradesh

More Telugu News