Revanth Reddy: మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy at MLA Medipalli Sathyam residence
  • ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి
  • రెండు రోజుల క్రితం సత్యం భార్య బలవన్మరణం
  • కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న రూపాదేవి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యం కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. ఆయన భార్య రూపాదేవి రెండ్రోజుల క్రితం.... గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారు.

రూపాదేవి అల్వాల్ పంచశీల కాలనీలోని తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయారు. కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. హోమియో మందులు కూడా వాడారు. అయినప్పటికీ కడుపు నొప్పి తగ్గకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ డిప్రెషన్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.
Revanth Reddy
Medipalli Sathyam
Congress

More Telugu News