Purandeshwari: వాటిపై సీబీఐ విచారణ జరిపించండి.. సీఎం చంద్రబాబుకు ఎంపీ పురందేశ్వరి ట్వీట్

MP Purandeshwari tweet to CM Chandrababu
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎంపీ పురందేశ్వరి ద‌గ్గుబాటి ట్వీట్ చేశారు. గ‌త ఐదేళ్ల‌లో మ‌ద్యం, అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాలంటూ లేఖ రాసిన విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు. "గ‌త ఐదేళ్ల‌లో ఆంధ్ర‌లో మ‌ద్యం, అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల ద్వారా జ‌రిగిన అక్ర‌మాల‌ను చంద్ర‌బాబుకు లేఖ ద్వారా వివ‌రించ‌డం జ‌రిగింది. నాణ్య‌తలేని మ‌ద్యంతో వేలాది మంది బ‌ల‌య్యారు. అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కం ప్ర‌కృతికి హాని క‌లిగించి నిర్మాణ రంగంలోని అనేక మందిని నిరుద్యోగుల‌ను చేసింది. ఈ రెండూ గ‌త ఐదేళ్లలో అధికారంలో ఉన్నవారి జేబులు మాత్ర‌మే నింపాయి. ఈ రెండు అక్ర‌మాల‌పై వెంట‌నే సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చెయ్య‌టం జ‌రిగింది" అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.   



Purandeshwari
CM Chandrababu
Andhra Pradesh
BJP

More Telugu News