Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

Student Leaders Protest At Union Minister Kishan Reddy House
  • నీట్‌ పరీక్ష రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన
  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో నిర‌స‌న‌
  • ఆందోళ‌న‌లో పాల్గొన్న ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. నీట్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ విద్యార్థి సంఘాల‌ నాయకులు ఇయన ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో ఎమ్మెల్సీ వెంకట్‌తో పాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నీట్‌ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరామని, అయినా ఆయన ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని విద్యార్థి సంఘాల‌ నాయకులు తెలిపారు.
Kishan Reddy
Student Leaders
Protest
NEET

More Telugu News