MLA Medipally Sathyam: తెలంగాణ‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం భార్య ఆత్మ‌హ‌త్య‌!

Choppadandi MLA Medipally Sathyam wife Rupadevi Suicide
  • చొప్పదండి ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య
  • అల్వాల్‌లోని నివాసంలో ఉరి వేసుకుని మృతి  
  • ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న రూపాదేవి  
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలం సృష్టించింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఆమె ఉరి వేసుకున్నారు. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు సూసైడ్‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. ఇంతలోనే ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ విషయం అర్ధరాత్రి బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MLA Medipally Sathyam
Rupadevi
Suicide
Congress
Telangana

More Telugu News