Daggubati Purandeswari: తన సోదరి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఆసక్తికర ఫొటో పంచుకున్న పురందేశ్వరి

Purandeswari wishes sister Nara Bhuvaneswari on her birthday
  • నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నారా భువనేశ్వరి
  • సోషల్ మీడియాలో విషెస్ వెల్లువ
  • సోదరికి శుభాకాంక్షలు తెలిపిన పురందేశ్వరి  
సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నారా భువనేశ్వరికి ఆమె సోదరి, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

"భువనేశ్వరికి సంతోషమయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె జీవితం అవధుల్లేని సంతోషం, ఆయురారోగ్యాలు, స్వచ్ఛమైన ఆనందంతో నిండాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పురందేశ్వరి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పురందేశ్వరి ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో అక్కచెల్లెళ్లు నారా భువనేశ్వరి, పురందేశ్వరి, లోకేశ్వరి నవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ కుమార్తెలను ఇలా సింగిల్ ఫ్రేమ్ లో చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Daggubati Purandeswari
Nara Bhuvaneswari
Lokeswari
Birthday
Andhra Pradesh

More Telugu News