Vangalapudi Vanitha: హోంమంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన వంగలపూడి అనిత‌

Vangalapudi Vanitha takes charge as Home Minister
  • బ్లాక్-2లో ప్రత్యేక పూజల అనంత‌రం బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌
  • మంత్రి అనితకు వేదపండితుల ఆశీర్వచనాలు
  • బొకేలు అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేత‌లు, ఉన్నతాధికారులు  
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలసి అభినందనలు తెలిపారు. బొకేలను అందించి ఆమెకు శుభాకాంక్షలను చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోం మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Vangalapudi Vanitha
Home Minister
Andhra Pradesh

More Telugu News