‘మోదీ బెదిరిపోరు’.. చైనాకు తైవాన్ కౌంటర్లు
- ఇటీవల మూడోసారి ప్రధాని అయిన మోదీకి తైవాన్ అధ్యక్షుడి అభినందనలు
- స్పందించి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని..
- ఆక్షేపించిన చైనా.. తాజాగా కౌంటర్లు ఇచ్చిన తైవాన్
‘‘మూడవసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి నూతన ప్రెసిడెంట్ లై చింగ్-తే ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. మోదీ కూడా ఎక్స్ వేదికగానే స్పందించారని అనుకుంటున్నాను. ఒకరికొకరు అభినందనలు చెప్పుకోవడం చాలా సాధారణ విషయం. ఇతరులు దీనిపై ఎందుకు స్పందిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇద్దరి అభినందనల మధ్య కలగజేసుకోవడం అసమంజసం’’ అని టిన్ చుంగ్ కౌంటర్ ఇచ్చారు. చైనా పేరు ఎత్తకుండానే ఆయన కౌంటర్ ఇచ్చారు. మోదీ, తమ అధ్యక్షుడు ఏమాత్రం భయపడబోరని తాను చెప్పదలచుకున్నానని అన్నారు.