Volunteers: వైసీపీ నేతల మాటలు నమ్మి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు

Resigned volunteers met minister Nimmala Ramanaidu in Palakollu
  • ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసిన పలువురు వాలంటీర్లు
  • నేడు పాలకొల్లులో మంత్రి రామానాయుడ్ని కలిసిన వాలంటీర్లు
  • వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వెల్లడి
  • తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి
  • వాలంటీర్ల వినతి పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి నిమ్మల
ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు నేడు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. పాలకొల్లులో మంత్రిని కలిసిన వాలంటీర్లు... ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయిన తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

వాలంటీర్ల విన్నపం పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. వైసీపీ నేతల మాటలు నమ్మిన వాలంటీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. 

నాడు...  రాజీనామాలు చేయొద్దు, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, జీతాలు కూడా పెంచుతాం అని పదేపదే చెప్పినా తమ మాట వినలేదని రామానాయుడు అన్నారు. కానీ వైసీపీ నేతల మాటలు నమ్మి ఉద్యోగాలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తనను కలిసిన వాలంటీర్లకు హామీ ఇచ్చారు.
Volunteers
Nimmala Rama Naidu
Palakollu
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News