Pawan Kalyan: అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కు ఘనస్వాగతం పలికిన రైతులు

AP Deputy CM Pawan Kalyan gets grand welcome from farmers in Amaravathi
  • రేపు పదవీ బాధ్యతలు చేపడుతున్న పవన్ కల్యాణ్
  • నేడు సచివాలయంలోని తన పేషీని పరిశీలించేందుకు అమరావతి రాక
  • సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి పవన్ కు నీరాజనాలు పలికిన రైతులు
సచివాలయంలోని తన పేషీని పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా రాజధానిలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కు రైతులు ఘనస్వాగతం పలికారు. 

సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద పవన్ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. గజమాలతో జనసేనానిని సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం గ్రామం వరకు రోడ్డుపై పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితుడైన పవన్ కల్యాణ్ రేపు (జూన్ 19) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. 

ఇవాళ విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్... వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి బయల్దేరారు. రేపు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, సచివాలయంలోని తన చాంబర్ లో చేయాల్సిన మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే అధికారులకు నేడు సూచనలు చేయనున్నారు.
Pawan Kalyan
Deputy CM
Amaravati
Farmers
Janasena
Andhra Pradesh

More Telugu News