YS Jagan: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచ‌ల‌న‌ ట్వీట్!

Andhra Pradesh Former Cm YS Jagan Mohan Reddy Tweet on EVMs
  • ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలన్న వైసీపీ అధినేత‌
  • అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌నే వాడుతున్నాయన్న జ‌గ‌న్‌
  • మనం కూడా అదే దిశగా పయనించాలని వ్యాఖ్య‌
ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌ రెడ్డి తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జగన్ ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయలేదు. అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. కానీ తొలిసారి ఆయన ఈవీఎంల గురించి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్‌ బ్యాలెట్లు ఉప‌యోగించ‌డం మంచిద‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

"న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి" అని జగన్ ట్వీట్ చేశారు. కాగా, ఈవీఎంలను హ్యాక్ చేయచ్చంటూ టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
YS Jagan
YSRCP
Andhra Pradesh
EVM

More Telugu News